పంట నష్టం వివాదం.. దంపతులపై కర్రలతో దాడి

పంట నష్టం వివాదం.. దంపతులపై కర్రలతో దాడి

అన్నమయ్య: రామసముద్రం మండలంలోని దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రమణ (41), భార్య గాయత్రి (35)లపై కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. తమ పొలంలోకి మంజులకు చెందిన పశువులు వెళ్లి పంటను నాశనం చేశాయని, దీనిపై మందలించడంతో కుటుంబ సభ్యులు దంపతులపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.