కదిరి ఎమ్మెల్యేకు పర్వీన్ భాను కృతజ్ఞతలు

కదిరి ఎమ్మెల్యేకు పర్వీన్ భాను కృతజ్ఞతలు

సత్యసాయి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన పర్వీన్ భాను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించినందుకు ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పర్వీన్ భానుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.