శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం..

శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం..

SRCL: సిరిసిల్ల బి.వై నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం అయ్యింది. వినాయక విగ్రహాన్ని శ్రీశ్రీశ్రీ పరమాత్మనందగిరి స్వామి చేతుల మీదుగా 8వ తేదీన ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు 7, 8వ తేదీలలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. ప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రెండు రోజులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.