నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

SKLM: ఆమదాలవలస మండలం అక్కివరం, తోటాడ, దూసి, వంజంగి గ్రామాల పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా లో తాత్కాలిక అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పైడి యోగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు లైనుపై చెట్లు కొమ్మల తొలగింపు పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించాలని కోరారు.