'ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి'
వరంగల్ నగరంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులతో అధిక పుస్తకాల బరువు మోయిస్తున్నాయని ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి చుక్క ప్రశాంత్ బుధవారం విమర్శించారు. పదవ తరగతి విద్యార్థులను రాత్రి 8 గంటల వరకు చదివించడం సరికాదన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్‌డీఎస్ నాయకులు పాల్గొన్నారు.