ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

MDK: శివంపేట మండలం ఉసిరిక పల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రమాద ఘటనకు కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంకట్ రెడ్డితో కలిసి ప్రమాద ఘటనలో జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించారు.