VIDEO: రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం విశేష సంఘటన చోటుచేసుకుంది. పెద్ద నాగుపాము దేవాలయం చుట్టూ తిరుగుతూ కనిపించడంతో భక్తులు మొదట భయభ్రాంతికి గురయ్యారు. అనంతరం ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తున్నట్టుగా నాగుపాము సంచరించడాన్ని చూసి భక్తులు దీనిని దేవుని మహిమగా భావించారు.