VIDEO: ప్రతిపక్ష నేతపై కక్షపూరిత చర్యలు: RS ప్రవీణ్ కుమార్
WGL: గ్రేటర్ వరంగల్‌లో 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ జీవనోపాధి కోసం నిర్వహిస్తున్న షాప్‌ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బాధిత కుటుంబసభ్యులను సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు ఉన్న షాప్‌ను కూల్చివేయడం అన్యాయం అన్నారు.