వికలాంగులుగా నిర్ధారణ కోసం సదరం క్యాంపు

KMR: జిల్లాలో ఈ నెల 11వ తేదీన వికలాంగుల నిర్దారణ కోసం సదరం క్యాంపుని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహింస్తునట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరియు ప్రతి మీ సేవ కేంద్రంలో సోమవారం నుండి శనివారం వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.