చిరుతపులిని చంపిన ముగ్గురు అరెస్ట్

చిరుతపులిని చంపిన ముగ్గురు అరెస్ట్

NRML: తాళ్లాపేట్ రేంజ్ పరిధిలో చిరుతపులిని వేటాడి చంపిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు FRO సుష్మారావు తెలిపారు. దండేపల్లి మండలం ఊట్ల గ్రామానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అడవి పందులను పట్టుకునేందుకు క్లచ్ వైర్‌తో ఉచ్చు పెట్టగా చిరుతపులి చిక్కుకుని మృతి చెందినట్లు నిందితులు అంగీకరించారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేశారు.