VIDEO: టమాటా సాగు.. రోడ్డున పడ్డ రైతు
WGL: పర్వతగిరి మండలం శ్రీనగర్‌కు చెందిన రైతు విజయభాస్కర్ టమాటా, వంకాయ పంటలతో తీవ్ర నష్టాలను చవిచూశాడు. రెండు ఎకరాల్లో టమాటా, ఒక ఎకరంలో వంకాయ సాగు చేసి ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. మార్కెట్లో టమాటాకు కూలీల ఖర్చులు, రవాణా వ్యయాలు కూడా రాకపోవడంతో పాటు వంకాయ క్వింటా బస్తాకు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.