ఎండ తీవ్రత.. కార్మికులు జాగ్రత్త
PDPL: రామగుండంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్మికులు, ఉద్యోగులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని జీడీకే ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మ సూచించారు. RG-1 ఏరియాలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. వేసవిలో నీరు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని, వడదెబ్బ లక్షణాలు, ప్రథమ చికిత్స గురించి వివరించారు. ఈ సూచనలు పాటించడం ద్వారా వేసవి తాపాన్ని తట్టుకోవచ్చని తెలిపారు.