ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

GTR: దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూప వాణి వెంకటేశ్వరరావు దంపతులు ఆధ్వర్యంలో సోమవారం దుగ్గిరాల రైలు పేటలో ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు.