‘భారత్‌లోనే తొలి మోటోక్రాస్ సినిమా’

‘భారత్‌లోనే తొలి మోటోక్రాస్ సినిమా’

భారతీయ తెరపై వస్తున్న తొలి మోటోక్రాస్ సినిమా 'బైకర్' అని, దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ కథను మలిచిన తీరు అద్భుతంగా ఉందని హీరోయిన్ మాళవిక ప్రశంసించింది. స్పోర్ట్స్ థ్రిల్లర్‌తో పాటు తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు ఈ సినిమాకు ప్రధాన బలమని తెలిపింది. మూడు భిన్నమైన కాలాల్లో సాగే ఈ కథలో నటించడం తనకు సవాల్‌గా అనిపించిందని, యూత్‌కు ఈ మూవీ స్ఫూర్తినిస్తుందని చెప్పింది.