ఎన్నికల ప్రచారం చేసిన DCCB ఛైర్మన్
ADB: తలమడుగు మండలంలో శనివారం డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి పర్యటించారు. మండలంలోని బరంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి బరిలో దిగిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిడాం లక్ష్మణ్ తరఫున ప్రచారం చేశారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం, గ్రామాభివృద్ధి జోరుగా జరుగుతుందన్నారు.