నేడు భూభారతిపై అవగాహన సదస్సు

NLG: భూభారతి చట్టంపై శాలిగౌరారం CMR ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం 9 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తాహసీల్దార్ యాదగిరి తెలిపారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.