ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

త్రిముఖ పోరుతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని డీఎంకే కూటమి ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు తమిళనాట అతిపెద్ద కూటమిని ఏర్పాటు చేసింది. ఎలాగైనా ఈసారి పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే కూటమి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు తొలిసారి తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన నటుడు విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.