కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
VSP: కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము విమర్శించారు. డిసెంబర్ 31 నుంచి విశాఖలో నిర్వహించే సీఐటీయూ అఖిలభారత మహాసభల గోడపత్రికను మంగళవారం అచ్యుతాపురం జంక్షన్‌లో ఆవిష్కరించారు. మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా జనవరి 4వ తేదీన హాజరవుతారని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.