ముగిసిన ఎన్నికలు.. 70% ఓటింగ్ నమోదు

ముగిసిన ఎన్నికలు.. 70% ఓటింగ్ నమోదు

W.G: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాళ్ల మండలంలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. కాళ్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) లో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ బూత్‌ల్లో 1,465 మంది ఓటర్లకు 1,028 మంది పట్టభద్రులు ఓటును వినియోగించుకున్నట్లు తహసీల్దార్ జీ.సుందర్ సింగ్ తెలిపారు. 70.17% ఓటింగ్ జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు.