ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు అరెస్ట్

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు అరెస్ట్

కృష్ణా: గుడివాడ నాగవరప్పాడు చాయ్ అడ్డాను కేంద్రంగా చేసుకొని కొంతమంది యువకులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు గుడివాడ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ పోలీసు సిబ్బందితో ప్రదేశంపై ఈరోజు దాడి చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.