'పేద రైతుల భూములు కాపాడేంతవరకు పోరాటం ఆగదు'

ప్రకాశం: పేద రైతుల భూములను కాపాడేంతవరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం ఆగదని ప్రజా సంఘాల నాయకులు ఖాదర్ భాష అన్నారు. సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పామూరులో అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పేదల భూములను కంపెనీలకు దౌర్జన్యంగా కట్టబెట్టడం అన్యాయం అన్నారు. చలో కరేడు కార్యక్రమానికి వచ్చిన సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు.