తాగు నీటి కోసం రోడ్డుపై ధర్నా

NRML: ముధోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు గత 20 రోజులుగా త్రాగు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. తమనెవరూ పట్టించుకోవడం లేదని వర్షం కురుస్తున్నా రోడ్డుపై ధర్నాకు దిగారు. నీటి సరఫరా లేకపోవడంతో విసిగిపోయిన గ్రామస్థులు, మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి కష్టాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.