'రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి గాయాలు'

BDK: అశ్వాపురం మండల పరిధిలో చింతిరియాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పద్దం ఎర్రయ్య శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా సారపాక పుష్కర్ ఘాటు వద్ద జామాయిల్ లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.