జడ్చర్లలో ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

జడ్చర్లలో ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు

MBNR: జడ్చర్ల పట్టణంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అద్వైత సిద్ధాంత కర్త అయిన శంకరాచార్యుల సేవలను భక్తులు కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు, సమాజ ఐక్యతకు ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.