ఈ నెల 27న జిల్లాకు రానున్న సీఎం

ఈ నెల 27న జిల్లాకు రానున్న సీఎం

KMM: ఈ నెల 27న CM రేవంత్ భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరువుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉగాది రోజు ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, CM రేవంత్ దంపతులను ఈ వేడుకలకు ఆహ్వానించనున్నారు. ఆలయ అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతగా రూ. 100 కోట్ల పనులకు CM శంకుస్థాపన చేస్తారన్నారు.