గుండెపోటుతో బాలిక మృతి

గుండెపోటుతో బాలిక మృతి

కృష్ణా: పామర్రు మండలం పెదమద్దాలిలో విషాదం చోటుచేసుకుంది. డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8వ తరగతి విద్యార్థిని గుమ్మడి లావణ్య (13) సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఈ నెల 5న జ్వరం రావడంతో తల్లిదండ్రులు బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం, గుండెపోటు కారణంగానే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.