కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం
PLD: దాచేపల్లి మండలం పొందుగుల గ్రామ శివారులోని కృష్ణా నదిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.