'ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలి'
హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం బాలసముద్రంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకొని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలన్నారు.