పోలీసు కస్టడీకి లేడీ డాన్ అరుణ
NTR: ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసిన కేసులో నిందితురాలు నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది. వారం రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెను 2 రోజుల పాటు విచారించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13, 14 తేదీల్లో సూర్యారావుపేట పోలీసులు అరుణను విచారించనున్నారు.