ఎనిమిది మంది పేకాటరాయులపై కేసు నమోదు

SRD: జహీరాబాద్ మండలం హోతి(బి) గ్రామ శివారులోని ఓరేకుల షెడ్యూల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కాశీనాథ్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి 55,350 నగదు ఎనిమిది సెల్ ఫోన్లు ఏడో ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.