'ఆదర్శనీయులు జ్యోతిభా ఫూలే'
VZM: మహాత్మా జ్యోతిభా ఫూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి కొనియాడారు. ఫూలే 135 వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిభా ఫూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం. ఫూలే, సావిత్రిబాయి విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు.