కానిస్టేబుల్‌కు ఎస్పీ ప్రశంస
CTR: శ్రీనగర్‌లో అక్టోబర్‌లో 10వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్–2025 క్రీడా పోటీలు జరిగాయి. పెంచక్ సిలాట్ విభాగంలో 60 కిలోల కేటగిరీలో చిత్తూరుకు చెందిన కానిస్టేబుల్ షంషేర్ పాల్గొని మూడొ స్థానం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కానిస్టేబుల్‌ను SP తుషార్ డూడీ అభినందించారు. క్రీడల్లో ప్రతిభ చూపడం అభినందనీయమని కొనియాడారు.