స్థానికులకు ఊరట కలిగిస్తున్న అంబలి కేంద్రం

స్థానికులకు ఊరట కలిగిస్తున్న అంబలి కేంద్రం

NRPT: మరికల్ మండలం తీలేరు గ్రామ స్టేజ్ వద్ద దివంగత మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ వజ్రమ్మ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డిల జ్ఞాపకార్థం శుక్రవారం డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. గత 42 సంవత్సరాలుగా నిరంతరంగా 100 రోజుల పాటు కొనసాగుతున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమం, స్థానిక ప్రజలకు దాహం తీరుస్తుందని వారు తెలిపారు.