రాత్రి నుంచి వర్షం.. రోడ్లన్నీ జలమయం

రాత్రి నుంచి వర్షం.. రోడ్లన్నీ జలమయం

TG: హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి 10 గంటల నుంచి మొదలైన వర్షం ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.