'ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యకు దూరం చేస్తోంది'
WGL: నర్సంపేట BRS పార్టీ కార్యాలయంలో ఇవాళ మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 2 సంవత్సరాల కాలం నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు రాక చాలామంది విద్యార్థులు విద్యను ఆపివేసే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్‌మెంట్స్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.