'అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలి'
SRCL: రేపు ఉదయం 10 గంటలకు సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే అంబేద్కర్ జయంతిని విజయవంతం చేయాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.