అవయవదానానికి కూడా అందరూ ముందుకు రావాలి: కమిషనర్

NLR: రక్తదానం లాగే అవయవదానానికి కూడా అందరూ ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ నందన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవదానం చేయడం ద్వారా వారి జీవితాలలో వెలుగును నింపిన వారవుతారని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలలో విస్తృత అవగాహన అవసరం అన్నారు. అవయవదానానికి సహకరిస్తున్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్‌ని ఆయన అభినందనలు తెలిపారు.