'ఆటో డ్రైవర్లు భద్రతా నియమాలు పాటించాలి'

VZM: ఆటో డ్రైవర్లు భద్రతా నియమాలు పాటించాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ.విజయ్ రాజ్ కుమార్ అన్నారు. మేడే వారోత్సవాలు పురస్కరించుకొని గజపతినగరం కోర్టు ఆవరణలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు తమ హక్కుల కోసం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. అలాగే కొత్త చట్టాలపై అవగాహన అవసరమని సూచించారు.