మండే హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే
BDK: కొత్తగూడెం మండలం సొసైటీ మాజీ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు మాతృమూర్తి ఇటీవల మరణించారు. సకాలంలో అందుబాటులో లేని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ హనుమంతరావు స్వగృహానికి వెళ్లి సీతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.