సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర గ్రామంలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మంగళవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. ఆలయ కమిటీ మాట్లాడుతూ.. భక్తులకు ప్రతి మంగళవారం ఆలయంలో అన్నసంతర్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.