నర్సీపట్నంలో ముస్లింల భారీ ర్యాలీ

నర్సీపట్నంలో ముస్లింల భారీ ర్యాలీ

AKP: వర్ఫ్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా నర్సీపట్నంలో ముస్లింలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కృష్ణ బజార్ జామియా మసీదు నుంచి ఆర్డీవో ఆఫీసు మీదుగా శ్రీకన్య థియేటర్ వరకు జరిగిన ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొన్నారు. జామియా మసీద్ ప్రెసిడెంట్ హుస్సేన్ మాట్లాడుతూ.. ముస్లింల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.