నగరంలో ఆవేటి వారాల సందడి

SKLM: నగరంలో మంగళవారం ఆవేటి వారాల సందడి నెలకొంది. ఈ సందర్భంగా గుజరాతిపేటలోని శ్రీ అసిరి తల్లి, నీలమ్మ తల్లి, రేగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి అమ్మవార్ల ఆవేటి సంబరాలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు కలశాలతో భారీ ఊరేగింపుతో ఆలయాలకు వచ్చి అమ్మవార్లకు చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవార్ల పాదాలు కడిగి పూజలు చేశారు.