రైతులకు రూ.77.79 కోట్లు చెల్లింపు: కలెక్టర్
MLG: ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. జిల్లాలోని 185 కొనుగోలు కేంద్రాల ద్వారా 61305.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి రాగా, 17% తేమతో 45488.480 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. 45435.600 మెట్రిక్ టన్నుల ధాన్యం బిల్లులకు రవాణా చేయబడిందని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.77.కోట్లు జమచేశామన్నారు.