రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు

MDK: రామాయంపేటలో రోడ్డు ప్రమాదాల నివారణకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ముందు ఇరువైపులా రోడ్డుపై పేరుకుపోయిన మట్టి వల్ల వాహనదారులకు పార్కింగ్ ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన పాలకవర్గ సభ్యులు, షాపుల ముందున్న మట్టిని తొలగించి రోడ్డును శుభ్రం చేయించారు. ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.