'మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

ప్రకాశం: ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో మార్కాపురం మండల అధికారులు అప్రమత్తంగా, ఉంటూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ చిరంజీవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకొని ఉండాలన్నారు. ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తెలియజేయాలని సూచించారు.