అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డుపై మురుగునీరు
VSP: విశాఖపట్నంలో ప్రధాన రహదారులుపై మురుగునీరు రోడ్డుపై ఏరులై పారుతోంది. అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డులో కొద్దిపాటి వర్షానికే రహదారిపైకి నీరు చేరడంతోపాటు మరుగు నీరు సైతం రోడ్డు పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, మురుగు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.