రైతు బిడ్డకు రాష్ట్రస్థాయి ర్యాంక్ అభినందనలు తెలిపిన ఎస్పీ
KMR: జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతు బిడ్డ శ్రీహర్షిత్ ఇంటర్ బైపీసీ ఫలితాల్లో 440కి 435 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఆయనను అభినందిస్తూ.. భయం వీడి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని ఆకాంక్షించారు. శ్రీహర్షిత్ కృషిని పలువురు కొనియాడుతున్నారు.