ఎమ్మెల్యేను కలిసిన జవహర్ నగర్ కాలనీ వాసులు

ADB: బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీ వాసులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిశారు. జవహర్ నగర్ కాలనీ పక్కనే ఉన్న చెరువు కట్ట(దేగామ ప్రాజెక్టు)భారీ వర్షాల కారణంగా ఎప్పుడు తెగుతుందోనని భయంగా ఉందన్నారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు.