వేట్లపాలెం ఘటన.. యాజమాన్యం నిర్లక్షమే కారణం
KKD: వేట్లపాలెం బాణసంచా దుర్ఘటనకు పరిశ్రమ యాజమన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వం నియమించిన సిట్ కన్వీనర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించడంతో, ఈ సమస్యకు ముగింపు పలికేలా ద్విసభ్య కమిటీ తుది అంచనాకు వచ్చిందన్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.