'మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఈనెల 20న మినీ మహానాడును నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. టీడీపీ ఆదేశాల మేరకు జరిగే ఈ మహానాడుకు నియోజకవర్గ పరిశీలకుడు హాజరవుతారని చెప్పారు. ఆరు మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.